BREAKING
మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం

పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

​పూతలపట్టు మేజర్ న్యూస్ :

పూతలపట్టు మండలం లోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఉభయ జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీరెడ్డి గురవారెడ్డి , తొలుత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, కర్పూర నీరాజనాలు అర్పించి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు ​ఈ సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు ఆధునిక కాలానికి అనుగుణంగా రూపొందించిన 'గ్రంథాలయాల యాప్'ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ, గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు ​అనంతరం పూతలపట్టు ఎంఈఓ ఈశ్వర్ పిళ్ళై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, రోజుకు కనీసం అరగంట పాటు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవాలని సూచించారు ఉపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని అన్నారు మరో ఉపాధ్యాయుడు నాదముని మాట్లాడుతూ, విద్యార్థులందరూ గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని ప్రతిరోజూ గ్రంథాలయాన్ని సందర్శించాలని కోరారు ​వారోత్సవాల మొదటి రోజు భాగంగా విద్యార్థులకు నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ (జీకే) టెస్ట్, క్విజ్ పోటీలకు అతిథులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బీడీసీ నిర్వాహకులు మాధవి, పురుషోత్తంతో పాటు స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్