పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం
రామభద్రపురం, నవంబరు 25 (మేజర్ న్యూస్ మండలంలోగురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూరి చేశామని ఎన్నికల అధికారి రత్నం తెలిపారు. ఈ ఎన్నికల కోసం 20 పంచాయతీల్లో 118 మంది పీవోలు, 212 మంది ఓపీఓలు, 30 మంది ఆర్వోలతోపాటు 12 మంది మైక్రో అబ్జర్వర్లును నియమించామని తెలిపారు. అలాగే 3 జోన్లు, 8 రూట్లు కూడా క్షే త్ర స్థాయిలో ఏర్పాటు చేసి ఆయా గ్రామ పంచాయతీలకు సిబ్బందిని తరలించామని తెలిపారు. అలాగే ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేశామని, ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు వెంకటరమణ, నాగతులసి, ఏవో సన్యాసిరావు, సీనియర్ అసిస్టెంట్ చొక్కాపు శ్రీరాములునాయుడు, జూనియర్ అసిస్టెంట్ చిట్టూరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.