BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

పంచాయతీ అభివృద్ధికే ఐక్యత రాగం

Select Suryaa Now
పంచాయతీ అభివృద్ధికే ఐక్యత రాగం

*పంచాయతీలో అభివృద్ధి పథంలో నడిపించేందుకే నడిపిల్లి సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంకలపల్లి శ్రీనివాసరావు అన్నారు. నడిపల్లి పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు తన సతీమణి, మాజీ సర్పంచ్ అయిన లంకలపల్లి గాయత్రి,, వెంకట అప్పారావు లతో కలిసి పంచాయితీ కేంద్రమైన నడిపల్లి తో పాటు శివారు గ్రామమైన చిన్న మేడిపల్లిలో భారీ ఎన్నికల ర్యాలీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయితీని అభివృద్ధి చేయాలన్న తపనే తప్ప తనకు ఎటువంటి స్వార్ధము లేదన్నారు. గత పది ఏళ్లుగా పంచాయితీకి సర్పంచ్గా పనిచేసినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో ఓటర్లకు గుర్తు చేశారు. పంచాయితీలో ఉన్న యువత అందరికీ వేదబయో ఫ్యూయల్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానంటూ ఈ సందర్భంగా ఓటర్ లకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశల కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఓటర్లు, అభిమానులు పాల్గొన్నారు.