ఫుట్‌బాల్ పోటీల్లో సత్తా చాటిన ఎస్.రాయవరం మండల విద్యార్థులు
ఎస్.రాయవరం, మేజర్ న్యూస్: ఈ నెల 9వ తేదీన కోటవురట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 ఫుట్‌బాల్ పోటీల్లో ఎస్.రాయవరం మండల విద్యార్థులు సత్తా చాటారు. మండలంలోని చినగుమ్మలూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారి లో చినగుమ్మలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థులు త్రిపుర, భార్గవ్, 8వ తరగతి విద్యార్థులు దీపిక, భవ్యశ్రీ, భవిష్య, భవాని, తనీష్, 7వ తరగతి విద్యార్థి పి.హాసిని, ఎస్.రాయవరం హైస్కూల్ బాలికల పాఠశాల నుంచి ఎం.డి.హలీమున్నిసా, టి.హారిక వున్నారు. జిల్లా స్థాయి పోటిల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై ఎస్. రాయవరం మండలానికి పేరు తెచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలతో ముంచెత్తారు.