BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్

Select Suryaa Now
ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్
  •  100వ వారం వేడుకల్లో భాగంగా  సైకిల్ ర్యాలీ
    విజయనగరం మేజర్ న్యూస్: విజయనగరం: ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ 100వ వారం వేడుకల్లో భాగంగా  మై భారత్  విజయనగరం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో పాటు నషా ముక్త్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం ఇండోర్ స్టేడియం సమీపంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని  మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామం వంటి శారీరక కార్యకలాపాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఫిట్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాల్గొన్న వారితో నషా ముక్త్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శాప్ కోచ్‌లు రవి కుమార్, మురళీకృష్ణ, మై భారత్  సిబ్బంది, వాలంటీర్లు మరియు యువత పాల్గొన్నారు.