పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు -అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు...... అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్
పొన్నూరు పట్టణం లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు జిబిసి రోడ్డులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై అర్బన్ పోలీసులు మెరుపు దాడి చేసారు జూదం ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 83,270/- రు నగదు, 13 సెల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరంగా తదుపరి చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ సీఐ ఆర్ కిషోర్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా పొన్నూరు టౌన్ సీఐ ఆర్.ఎస్. కిషోర్ కుమార్ మాట్లాడుతూ.... పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట జూదం వంటి అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తమ పరిసరాల్లో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్