పవన్ కళ్యాణ్ చ్చే అక్టోబర్ 13న ఆత్మకూరు బైపాస్ రోడ్ ప్రారంభం
పవన్ కళ్యాణ్ చే అక్టోబర్ 13న ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం
-=ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో8.91 కోట్లతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ
– సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ, ప్లాంటేషన్‌తో నూతన శోభ
~పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మకూరు బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.
సుమారు రూ.8 కోట్ల 91 లక్షల వ్యయంతో బైపాస్ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడంతో పాటు సెంట్రల్ లైటింగ్, రహదారి సుందరీకరణ, ప్లాంటేషన్ తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
ఈ నూతన నాలుగు లేన్ల బైపాస్ రహదారిని అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ఉదయం 11:00 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రారంభోత్సవ సభను నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి గారు కోరారు.ఆదివారం ఆయన ఈ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాళ్లూరు గిరి నాయుడు, తుమ్మల చంద్రా రెడ్డి, జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్, బిజెపి నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.