BREAKING
నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్!

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విప్ నాయకర్

Select Suryaa Now
 పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విప్  నాయకర్

నర్సాపురం రూరల్, మేజర్ న్యూస్:పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా శనివారం  నియోజకవర్గంలో అభివృద్ధి పనులకురాష్ట్ర ప్రభుత్వ విప్,  బొమ్మిడి నాయకర్ భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గంలోని లిఖితపూడి, మొగల్తూరు, జగన్నాధపురం, పాతపాడు, కాళీపట్నం తూర్పు, ముత్యాలపల్లి, పేరుపాలెం సౌత్, పేరుపాలెం నార్త్, రామనపాలెం, పసలదీవి, వేములదీవి వెస్ట్, మర్రితిప్ప తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా, రవాణా సదుపాయాలను మెరుగుపరచడం, పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగాలక్షలాది రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారులు, మినీ గోకులం షెడ్ల పనులకు పలు గ్రామాల్లో ఆయన శంకుస్థాపన చేశారు. స్థానికులు దహన సంస్కారాల సమయంలో పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతూలిఖితపూడి, పాతపాడు, కాళీపట్నం తూర్పు, ముత్యాలపల్లి, పేరుపాలెం నార్త్, రామనపాలెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన స్మశానవాటికలను  బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ తుది వీడ్కోలు అత్యంత గౌరవప్రదంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సున్నితమైన సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ స్మశానవాటికలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామానికీ మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు, జనసేన,టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు

 

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా