పైడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రధాన ఘట్టం సిరిమాను ఉత్సవం అనంతరం జరుగు ముఖ్య మైన ఉత్సవాలలో ఉయ్యాల కంబాల ఒకటి. గత రెండు వారాల క్రితం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు మంగళవారం ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు.తెల్లవారుఝూము నుండి భక్తులు కుటుంబ సమేతంగా చెదురు గుడికి ఘట్టాలతో డప్పు వాదాలు, విచిత్ర వేషధారణలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, చీరెలు గాజులు పూలు పండ్లు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉంచిన పూలతో ప్రత్యేక అలంకరణలు చేసిన ఊయలపై ఉంచిన అమ్మవారి ప్రతిమ, ఘటాలకు నమస్కరించి ఊంజల్ సేవా చేసుకున్నారు. ఈ కార్యక్రమాలో రాత్రి ఆలయం మూసిన తదుపరి ఆలయ ప్రధానపూజారి (బంటు పల్లి వెంకటరావు) అమ్మవారి ప్రతిమను తన ఒడిలో ఉంచుకుని ఉత్సవంలో పాల్గొనడం పరిపాటి. వందలాది భక్తులు ఉత్సవానికి విచ్చేయడంతో దేవస్థానం ఇఓ కె.శిరీష పర్యవేక్షణలో భక్తులు సౌకర్యం కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు.