BREAKING
బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన రసమే సాహిత్యానికి ప్రాణం.. మహిళా వర్సిటీ తెలుగు సాహితీ సమితిలో ఆచార్య పి.హరనాథ్

పద్మనాభపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

Select Suryaa Now
పద్మనాభపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

 

యువకుడు మృతి,ఇద్దరికి తీవ్ర గాయాలు.

బుల్లెట్ ఆటోను ఢీకొని బోర్డును గుద్దుకుంది - సంఘటనా స్థలంలోనే దివాకర్ మృతి.

పలాస,నవంబర్ 24,మేజర్ న్యూస్.

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం గ్రామం, పాత జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు.మృతుడిని డొక్కరి దివాకర్ (26) గా గుర్తించారు. గాయపడిన వారు పిల్లల బాలకృష్ణ, దట్టి గోవిందరావు.వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయాల పాలైన వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోవిందరావు, బాలకృష్ణ, దివాకర్లు ముగ్గురు ఒకే బుల్లెట్ వాహనంపై కాశీబుగ్గ వస్తున్నారు.ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వెళ్తున్న ఆటోకు ఢీకొనడంతో అదుపుతప్పి, గ్రామం పేరు తెలిపే బోర్డును ఢీకొన్నారు.సంఘటన స్థలంలోనే దివాకర్ మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయాలతో రోడ్డుపై పడిపోయారు.మృతుడితో పాటు గాయాలకు గురైన వారందరూ వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన వారని తెలిసింది.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కాశీబుగ్గ ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.