BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

పదేళ్ల నిరీక్షణకు తెర.. ఆకులవారి ధర్మతోపు భూములకు విముక్తి

Select Suryaa Now
పదేళ్ల నిరీక్షణకు తెర.. ఆకులవారి ధర్మతోపు భూములకు విముక్తి

పదేళ్ల నిరీక్షణకు తెర.. ఆకులవారి ధర్మతోపు భూములకు విముక్తి

27.80 ఎకరాల భూములపై దేవాదాయశాఖ కీలక నిర్ణయం

సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి గొట్టిపాటి రవికుమార్

500 కుటుంబాలకు భారీ ఊరట

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 దశాబ్దకాలంగా అద్దంకి ప్రజలను వెంటాడుతున్న ఆకులవారి ధర్మతోపు భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండటంతో భూముల క్రయవిక్రయాలు, రుణాలు, కుటుంబ అవసరాలకు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్న సుమారు 500 కుటుంబాలకు భారీ ఊరట కలిగింది. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా సీఎం ఆదేశాలతో దేవాదాయశాఖ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేపట్టారు. సంబంధిత రికార్డులు, రెవెన్యూ దస్త్రాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం దృష్టికి మంత్రి గొట్టిపాటి.. కదిలిన యంత్రాంగం: ‘ఆకులవారి ధర్మతోపు’ భూముల సమస్యను పరిష్కరించాలని బాధితులు, స్థానికులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దకాలంగా కొనసాగుతున్న సమస్య తీవ్రతను మంత్రి పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక నాయకులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల అధికారులు రికార్డులను సమగ్రంగా పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులు పాత రికార్డులు, రెవెన్యూ దస్త్రాలు, భూముల వర్గీకరణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియ అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 27.80 ఎకరాలకు దేవాదాయశాఖ నుంచి విముక్తి: అధికారిక రికార్డుల పరిశీలన అనంతరం అద్దంకి ఉత్తర గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1096/Aలో 8.32 ఎకరాలు, సర్వే నంబర్ 1096/Cలో 0.40 ఎకరాలు, సర్వే నంబర్ 1096/Eలో 10.76 ఎకరాలు, సర్వే నంబర్ 1096/A2లో 8.32 ఎకరాలు కలిపి మొత్తం 27.80 ఎకరాల భూమిని దేవాదాయశాఖ దస్త్రాల నుంచి తొలగించేందుకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సమస్య పరిష్కారంలో ఇప్పటికే జూన్ 5న కీలక అడుగు పడింది. అద్దంకిలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆధ్వర్యంపలో సంబంధిత భూములను రెవెన్యూ దస్త్రాల నుంచి తొలగిస్తూ లబ్ధిదారులకు పత్రాలు అందించారు. అయితే దేవాదాయశాఖ రికార్డుల్లో భూములు కొనసాగుతుండటంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా కమిషనర్ ఉత్తర్వులతో ఆ అడ్డంకి కూడా తొలగిపోయింది. 1919లోనే సర్కార్ టెన్యూర్‌లోకి.. 500 కుటుంబాలకు ఊరట: ఈ భూములపై అధికారులు నిర్వహించిన సమగ్ర పరిశీలనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ సెటిల్‌మెంట్ రికార్డులు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, పాత అడంగల్, రెవెన్యూ బోర్డు ఉత్తర్వులు తదితర రికార్డులను పరిశీలించారు. ఈ భూములు తొలుత ‘ఇనాం డ్రై–చారిటబుల్ తోపు’గా నమోదైనప్పటికీ.. 1919 ఏప్రిల్ 1న రెవెన్యూ బోర్డు ప్రొసీడింగ్స్ నం.230/19 ప్రకారం సంబంధిత భూముల్లోని విస్తీర్ణం ఇనాం హక్కుల నుంచి తొలగించి సర్కార్ టెన్యూర్‌లోకి మార్చినట్లు అధికారులు గుర్తించారు. 2016కు పూర్వం ఈ ప్రాంతంలో భూములకు క్రయవిక్రయాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. అనంతరం భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూములను విక్రయించేందుకు, తనఖా పెట్టి రుణాలు పొందేందుకు, పిల్లల చదువులు, వివాహాలు తదితర కుటుంబ అవసరాలకు వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబాలు దశాబ్దకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూశాయి. ఈ భూముల పరిధిలో పోలీస్ స్టేషన్, ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన భవనాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాణిగారి సత్రం, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం తదితర ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటి పరిసరాల్లో సుమారు 500 వరకు వ్యక్తిగత కట్టడాలు ఉన్నట్లు స్థానికంగా చెబుతున్నారు. భూముల హక్కులు, రిజిస్ట్రేషన్లపై స్పష్టత లేకపోవడంతో ఆయా కట్టడాల యజమానులు కూడా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవ కీలకంగా మారిందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలు, ఆధారాలను సేకరించి అధికారులకు అందించడంలో స్థానిక నాయకులు సహకరించారు. దీంతో రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు వివిధ రికార్డులను సమగ్రంగా పరిశీలించి సమస్యపై స్పష్టతకు వచ్చారు. తాజా ఉత్తర్వులతో ఈ భూములపై ఆధారపడి ఉన్న సుమారు 500 కుటుంబాలకు ఊరట లభించినట్లయింది. దశాబ్దకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు మార్గం సుగమం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.