పాతపట్నం టు తెంబూరు డబల్ రోడ్డుకు మంత్రికి వినతి.
బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి అన్నెపు.
ఉమామహేశ్వర రావు.
పాతపట్నం
పాతపట్నం నుంచి టెక్కలి వెళ్లే జాతీయ రహదారి పాతపట్నం నుంచితెంబూరు వరకు డబల్ రోడ్డుకు మంజూరు కోరుతూ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి అన్నెపు. ఉమామహేశ్వర రావు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కు వినతి పత్రం ఇచ్చారు. పాతపట్నం నుంచి తెంబూరు రహదారి డబల్ రోడ్డు చేస్తే ట్రాఫిక్ నియంత్రణకు, రహదారి ప్రమాదాలకు భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రిని ఉమామహేశ్వర రావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఈ రహదారికి డబల్ రోడ్డు శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చారని అన్ని ఉమామహేశ్వరరావు విలేకరులకు తెలిపారు.