BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

ఓటు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి

Select Suryaa Now
ఓటు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి

విజయవాడ మేజర్ న్యూస్ : రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఓటరూ భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరున్నవారు ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. అవి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పోస్టాఫీసు పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం వేతన జాబ్ కార్డు, ఆరోగ్య బీమా కార్డు, పింఛను పత్రం, ఉద్యోగ గుర్తింపు కార్డు, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), స్మార్ట్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు అని కలెక్టర్ వివరించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.