ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు
గజపతినగరం, సూర్య : గజపతినగరం మండలంలో 16 సెగ్మెంట్లకు గాను వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 78 మంది నామినేషన్ దాఖలు చేయగా, ఆ నామినేషన్లు పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. రమేష్, అదనపు ఎన్నికల రిటర్నింగ్ అధికరణ బి .కళ్యాణి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉదయం పరిశీలించారు, అన్ని నామినేషన్లు కూడా సక్రమముగా ఉన్నట్లు ధ్రువీకరించారు, అభ్యర్థులందరూ కూడా ఊపిరి తీసుకొని సంతోషంగా బయలుదేరారు.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.