BREAKING
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్ రజనీకాంత్‌తో మనవడు యాత్రా రాజా స్టైలిష్ వాక్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా

న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలి


 

 

రూరల్ సీఐ పై కఠిన చర్యలు తీసుకోవాలి:   

 బార్ అసోసియేషన్
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :
న్యాయవాది ఎం ఏడుకొండల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. రాంబాబు పై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. శుక్రవారం కోర్టు భవనాల వద్ద  సి ఐ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుజ్జర్లపూడి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ పెద్దమక్కినకు సంబంధించిన ఇద్దరు యువకులను అక్రమంగా నిర్బంధించగా ఈ విషయాన్ని తెలుసుకొని న్యాయవాదులు యం ఏడుకొండలు, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రోళ్ళ మాధవి, సీనియర్ అడ్వకేట్ అంకాళ్ల వెంకటేశ్వర్లు, గుంటూరు మాణిక్యరావుతో అక్కడకు వెళ్లి ఎందుకు వారిని అక్రమంగా నిర్బంధించారని అడగ్గా పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడుతుంటే, న్యాయవాది ఏడుకొండలు "సిఐ గారు మీరు ఎందుకు అలా పెద్దగా అరుస్తున్నారు" అని అడుగగా నా ఇష్టం స్టేషన్లో నుంచి వెళ్లిపోండి అంటూ పెద్దగా కేకలు వేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రశ్నించే గొంతుని అణిచివేయాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదు. బాధితుల తరుపున నిలబడి ప్రశ్నించటమే న్యాయవాది హక్కు. సర్కిల్ ఇన్స్పెక్టర్ తన స్థాయికి తగని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా డీఎస్పీ జోక్యంతో స్టేషన్లో ఉంచిన ముగ్గురు యువకులను బయటకు పంపించారు. న్యాయవాదులుగా సమాజాన్ని పరిరక్షించే వృత్తిలో ఉన్న మేము చట్టపరంగా ప్రశ్నిస్తే, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐ రాంబాబు పై చర్యలు తీసుకునేలా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అంతేకాకుండా సీఐ రాంబాబు తరపున ఎవరు వాదించకుండా తీర్మానం చేయటం జరిగింది. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ సెక్రటరీ దృష్టికి, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తూ చట్టపరంగా చేయవలసిన అన్ని చర్యలు చేపడతామని న్యాయవాది ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, చేవల బాలకోటయ్య, జూపల్లి శేషయ్య, షేక్ బాల సైదా, మూర్తి, పాటిబండ్ల రవి, షేక్ నాగూర్ బాబు, లేళ్ల సాంబిరెడ్డి, బాదినేడి శ్రీనివాసరావు, సుధీర్ గంగిరాజు, కృష్ణ, రామారావు, బూతుకూరి రామిరెడ్డి, ఎం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
 
గన్నవరం ఏలియ.