BREAKING
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్ రజనీకాంత్‌తో మనవడు యాత్రా రాజా స్టైలిష్ వాక్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా

భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్..

Select Suryaa Now
భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్..

సూర్య రాజన్న సిరిసిల్ల..  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా బీమా దరఖాస్తులో వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి... కుటుంబాల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచ, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 23 వ వార్డు లో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయగా, పరిశీలించారు. రిజిస్టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేయగా, పరిశీలించి.. ఎందరు నమోదు చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో బీమా వివరాలు నమోదు చేస్తుండగా, పరిశీలించి.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో ఆరా తీశారు. సిరిసిల్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ లు ఉన్నాయని వివరించారు. బీమా వివరాల నమోదు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. అర్జీదారులు రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రత్యేక కేంద్రాల్లో బీమా వివరాలు, నామినీ వివరాలు పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, నోడల్ అధికారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల 23వ వార్డు సభ్యురాలు ఆడెపు చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్లు జయంత్, మహేష్ తదితరులు ఉన్నారు.