BREAKING
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్ రజనీకాంత్‌తో మనవడు యాత్రా రాజా స్టైలిష్ వాక్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా

అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా?

Select Suryaa Now
అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా?

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మాన్‌స్టర్ గురించి ఆసక్తికర కథాంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో సల్మాన్ పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బయటి ప్రపంచానికి, తన కుటుంబానికి బాధ్యతాయుతమైన భర్తగా, ప్రేమగల తండ్రిగా కనిపిస్తూనే, మరోవైపు ఎవరికీ అంతుచిక్కని మిస్టీరియస్ అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ నటిస్తున్నట్లు సమాచారం. ఆ డాన్ అసలు రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని, కేవలం అతని పేరు మాత్రమే ప్రజలకు, ప్రభుత్వానికి తెలుసనే కోణంలో కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.  

ఈ కథలో ప్రధాన మలుపు నయనతార పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ భార్యగా కనిపించబోయే నయనతార, వాస్తవానికి ఒక పవర్‌ఫుల్ అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ అంతుచిక్కని అండర్‌వరల్డ్ డాన్‌ను పట్టుకుని, అతని సామ్రాజ్యాన్ని కూల్చే బాధ్యతను ఆమెకు అప్పగిస్తారట. ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటూనే, వృత్తిపరమైన బాధ్యతల మధ్య నడిచే ఈ సంఘర్షణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, రాహుల్ దేవ్, రోనిత్ రాయ్, సీమా బిస్వాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.   సల్మాన్ ఖాన్ స్టైల్, నయనతార ఇంటెన్స్ యాక్షన్ కలయికలో వస్తున్న మాన్‌స్టర్ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న కథాంశమే నిజమా లేక దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంకా ఏదైనా ప్రత్యేక ట్విస్ట్ దాచారా అన్నది సినిమా విడుదల తర్వాతే స్పష్టమవుతుంది. ఏదేమైనా ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.