BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి

Select Suryaa Now
ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో కొత్త తరం కథానాయికల రాకతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆకాశంలో ఒక తార చిత్రంతో సాత్విక వీరవల్లి తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే సాత్విక నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసిన సాత్విక వీరవల్లి, ఇప్పుడు వరుసగా ఆసక్తికర ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  

తొలి సినిమా ఫలితం తేలకుండానే సాత్వికకు అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కబోయే తదుపరి చిత్రంలో సాత్విక కథానాయికగా నటించనున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆకాశంలో ఒక తార ఫుటేజ్ చూసిన తర్వాత సాత్విక నటనలోని పరిణతి నచ్చడంతోనే తమ బ్యానర్‌లో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం ఆమెను ఎంపిక చేసినట్లు అల్లు అరవింద్ పేర్కొన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ఇదే కాకుండా సాత్విక వీరవల్లి పేరు మరో భారీ ప్రాజెక్ట్ విషయంలోనూ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలోనూ కథానాయికగా సాత్విక పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు తమిళంలో ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న జాకీ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్తలే గనుక నిజమైతే సాత్విక వీరవల్లి కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టినట్లవుతుంది.

అమెరికాలో ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంపై ఆసక్తితో వచ్చిన సాత్విక, తొలి చిత్రంలోనే ఆకట్టుకునే ప్రదర్శనతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరోయిన్ భవిష్యత్ ప్రాజెక్టులపై సినీ అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతోంది.