బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు
సూర్య బాల్కొండ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామానికి నూతనంగా ఏడు ఆసరా/చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదలకు అండగా నిలుస్తూ ఏడు నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బస్సాపూర్ గ్రామ ప్రజల తరఫున, గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం సంతోషకరమని పేర్కొన్నారు.