BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన?

Select Suryaa Now
కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన?

కడప/అమరావతి, నవంబర్ 20: వైఎస్సార్ కడప జిల్లా కూటమి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుండటం స్థానిక రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

కడప జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో కూటమి నేతల తీరుపై ఆయన అలకబూనారని, తన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదనతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన హుటాహుటిన కడప నుంచి విజయవాడకు బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ పార్టీ అధిష్టానం, కూటమి పెద్దలతో భేటీ అయి తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి తదుపరి నిర్ణయంపై కడప జిల్లా కూటమి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.