BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా జడ్పీ పీఠంపై గొల్లపల్లి అమూల్య....

Select Suryaa Now
అంబేడ్కర్ కోనసీమ జిల్లా జడ్పీ పీఠంపై గొల్లపల్లి అమూల్య....

*అంబేడ్కర్ కోనసీమ జిల్లా జడ్పీ పీఠంపై గొల్లపల్లి అమూల్య.... మామిడికుదురు *
*అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆమె, 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో మామిడికుదురు జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల్లో సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న అమూల్య, గతంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తాజాగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడంతో జిల్లా రాజకీయాల్లో కీలక స్థానాన్ని పొందారు. జిల్లా పరిషత్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కోనసీమ జిల్లా పరిషత్‌కు నాయకత్వం వహించనున్న అమూల్య పదవీకాలంలో జిల్లా అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాలి.