BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు

Select Suryaa Now
కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తమిళ బుల్లితెర షో కుక్ విత్ కోమలి ద్వారా విశేష గుర్తింపు పొంది, ఆ తర్వాత హీరోగా ఎదిగిన అశ్విన్ కుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు భువనేశ్వరిని ఆయన పెళ్లాడారు. కోయంబత్తూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.  


పెళ్లి కూతురు భువనేశ్వరి దివంగత సినీ దర్శకుడు రాజశేఖర్ మనవరాలని సమాచారం. కన్నీర్ పూక్కళ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన రాజశేఖర్, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దళపతి తరహాలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న అశ్విన్ కుమార్, భువనేశ్వరి ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటి కావడంతో అభిమానులు, సినీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  

అశ్విన్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే, కోయంబత్తూరులో జన్మించిన ఆయన తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. అనంతరం మణిరత్నం తెరకెక్కించిన ఓ కాదల్ కన్మణి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన అశ్విన్, ఆదిత్య వర్మ సినిమాలో ధ్రువ్ విక్రమ్ సోదరుడిగా నటించారు. ఆ తర్వాత ఎన్న సొల్ల పోగిరాయ్, సెంబి, మీట్ క్యూట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.  

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన అశ్విన్ కుమార్, ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. వివాహ వేడుకకు సంబంధించిన క్షణాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అశ్విన్ కుమార్ భువనేశ్వరి జంటకు నెటిజన్లు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.