BREAKING
ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి ఏపీఎండీసీ ఐపీఓకు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్‌లైన్.. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల తనిఖీలు..? పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యువ హీరో శివ కందుకూరి.. ప్రియురాలితో నిశ్చితార్థం ఫోటోలు వైరల్ ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అశ్విన్ కుమార్ పెళ్లి.. ప్రియురాలు భువనేశ్వరితో ఏడడుగులు వేసిన నటుడు పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో రష్మిక మందన్న భావోద్వేగ ప్రసంగం.. ఆధ్యాత్మిక ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు బస్సాపూర్ గ్రామానికి 7 నూతన పెన్షన్లు మంజూరు జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. కడప రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా యోచన? తిరుపతి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా హెచ్ హేమలత ప్రమాణ స్వీకారం వేమవరం సర్పంచ్ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంబూరి రాజ్యలక్ష్మి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో లింగాల గ్రామంలో నామినేషన్ దాఖలు

జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని.

Select Suryaa Now
జడ్పీ చైర్మన్, జడ్పిటిసి ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని.

అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా నాగరాజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీలతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజుకు, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జడ్పీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి రంగాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు.