మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత
ముప్పాళ్ల, మేజర్ న్యూస్ : పల్నాడు జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పుచ్చకాయల రమాదేవి ని, వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నల్లపాటి కీర్తన ను జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా అనిత ఘనంగా సత్కరించారు. శుక్రవారం నరసరావుపేటలోని మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ప్రత్యేక పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బొర్రా అనిత మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లా తొలి జడ్పీ పీఠాన్ని అధిష్టించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. చైర్‌పర్సన్ పుచ్చకాయల రమాదేవి , వైస్ చైర్‌పర్సన్ నల్లపాటి కీర్తన సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముప్పాళ్ల మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ పాలకవర్గం పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.వారితో పాటు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు , బొర్రా సురేష్ బాబు , బొర్రా సరస్వతి , నాగేశ్వరమ్మ , బద్దుల ప్రకాష్ రావు, నాదెండ్ల నాగేశ్వరరావు పాల్గొనారు
గన్నవరం ఏలియ.