BREAKING
అండర్‌వరల్డ్ డాన్‌గా సల్మాన్ ఖాన్.. అండర్‌కవర్ కాప్‌గా నయనతార.. మాన్‌స్టర్ కథ ఇదేనా? భీమా దరఖాస్తులో వివరాలు నమోదు పక్కగా ఉండాలి కలెక్టర్ గరీమ అగర్వాల్.. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన జనసేన పార్టీ రేణిగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం జయలలిత ఉద్దానంపై 'అక్వాన్' తుపాను ఎఫెక్ట్.. ఉప్పొంగుతున్న బాహుదా నది ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలి కాళ్యపూర్ కు 11 నూతన పెన్షన్లు మంజూరు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. తడగొండలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని పరిశీలించిన తహసీల్దార్.. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్.. ఆకాశంలో ఒక తారపై రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. దుల్కర్ సల్మాన్ సినిమాపై ఆసక్తికర రివ్యూ మెగాస్టార్ విశ్వంభరపై లేటెస్ట్ అప్‌డేట్.. ట్రైలర్ సిద్ధం, రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూపులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదేనంటూ స్పెషల్ పోస్ట్ వైరల్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ.. అల్లు అరవింద్ గోల్డెన్ ఆఫర్ దక్కించుకున్న సాత్విక వీరవల్లి నెక్స్ట్ సినిమాలి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్..

Select Suryaa Now
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్..
కడప/పులివెందుల, నవంబర్ 20: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకే ప్రివెంటివ్ అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అంకాలమ్మ గూడూరు వద్ద కాన్వాయ్‌పై దాడి:అంతకుముందు, సింహాద్రిపురం మండలంలో వైసీపీ సానుభూతిపరులు సర్పంచ్ నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా టీడీపీ వర్గీయులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు వద్దకు చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి వాహన శ్రేణిపై టీడీపీ అనుచరులు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులతో దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన అవినాష్ రెడ్డిని, 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ అరెస్టు విషయం తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.