తడగొండలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని పరిశీలించిన తహసీల్దార్.. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
సూర్య..బోయినపల్లి మండలం తడగొండ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రక్రియ సరళిని సూపర్ వైజర్ తహసీల్దార్ షరీఫుద్దీన్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో జరుగుతున్న నమోదు ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం చేరేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చేపురి వెంకటేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమలత, జూనియర్ అసిస్టెంట్ ఖలీల్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.