ఇందిరమ్మ బీమా పథకం కుటుంబానికి భరోసా
సూర్య తాడ్వాయి : తాడ్వాయి మండలం దేవయిపల్లి గ్రామం లో ఈరోజు సర్పంచ్ నరేష్ ఉపసర్పంచ్ సతీష్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు జిపి పాలకవర్గం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు.తెలంగాణలోని కోటికిపైగా కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా చేస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట బీమా తీసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు లేదా నామినీకి రూ. 5 లక్షలు పరిహారంగా చెల్లిస్తారు. రేషన్ కార్డులు లేని వారు సైతం ఈ బీమా పథకం కానికి అర్హులుగా ఉంటారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ప్రజలకు ఎంతో గానో ఉపయోగపడుతుందని నాయకులు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవులు, మండల అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పైడి రాజేశ్వర్ రెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, దేమె సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, అంబీర్ శ్యాంరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, రాజేందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.