BREAKING
పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు గ్రామంలో షెడ్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి నికోల్స్ అజేయ 175తో కివీస్ 368.. యశస్వి, రాహుల్ జోరుతో టీమిండియా దీటైన బదులు జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తా... జడ్పీ చైర్ పర్సన్ గొల్లపల్లి అమూల్య..... భారీ వాహనాల రాకపోకలతో ప్రజలకు ఇబ్బందులు - ప్రమాదాలకు తావులేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి సేవకుడిగా ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవినీతి, లంచాలకు తావులేని పాలన అందిస్తా తోపుడు బండ్లకు మార్కెట్ సుంకం రద్దు చేస్తా.. ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ హామీ 897 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే? రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్

రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు

Select Suryaa Now
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు
సూర్య ఉట్నూర్ : ఉట్నూర్ కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్,డిడి అశోక్,ఎంపీడీవో రాయిస్ ఉల్లా , గ్రామ సర్పంచ్‌ అనిత జాదవ్ , ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిమితుల దృష్ట్యా తొలుత రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. రానున్న ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా తగిన విధానం ద్వారా ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-దరఖాస్తుల స్వీకరణ క్రమబద్ధంగా జరగాలి:
ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కావడంతో అన్ని వార్డుల ప్రజలు ఒకేసారి దరఖాస్తుల కోసం రావడం వల్ల రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి రోజు నిర్దేశించిన వార్డుల ప్రజలు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
-నామినీ వివరాలపై స్పష్టత ఉండాలి:
దరఖాస్తులో నామినీలుగా ఎవరిని ఎంపిక చేస్తున్నారో, 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారి విషయంలో అపాయింటీగా ఎవరిని నియమిస్తున్నారో, బీమా ప్రయోజనంలో ఎవరికి ఎంత శాతం వాటా కేటాయిస్తున్నారో లబ్ధిదారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నమోదు చేసే వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.
-మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడీ భద్రపరుచుకోవాలి:
దరఖాస్తు సమర్పించిన అనంతరం అప్లికేషన్ ఐడీ సంబంధిత లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు సందేశం రూపంలో వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. అప్లికేషన్ ఐడీని భద్రపరుచుకోవాలని, భవిష్యత్తులో ఈ ఐడీ ద్వారా దరఖాస్తు వివరాలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
-దరఖాస్తు వివరాల్లో తప్పులు ఉండకూడదు:
ఈ పథకం ఆర్థిక, బీమా, బ్యాంకింగ్ అంశాలతో ముడిపడి ఉన్నందున దరఖాస్తులో పేర్కొనే ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. లబ్ధిదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, నామినీ వివరాలు, వాటాల శాతం తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దరఖాస్తు ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత మార్పులు చేసుకునే అవకాశం లేనందున సబ్‌మిట్ చేయడానికి ముందే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.
-రిసెప్షన్ వద్ద ఫారాలు అందుబాటులో ఉంటాయి:
దరఖాస్తుదారుల సౌకర్యార్థం కార్యాలయం వెలుపల రిసెప్షన్ వద్ద ఖాళీ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముందుగా ఫారాలను పూర్తిగా నింపుకుని, నామినీలు, వారికి కేటాయించే వాటాల శాతం వంటి వివరాలను ఖరారు చేసుకున్న తర్వాతే కంప్యూటర్ వద్దకు రావాలని తెలిపారు. దీనివల్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియ ఎలాంటి గందరగోళం లేకుండా సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు.రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు కూడా అధికారులకు సహకరించి దరఖాస్తుల నమోదు ప్రక్రియను క్రమపద్ధతిలో పూర్తి చేసుకోవాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు కోరారు.