BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే, కలెక్టర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో మహారాష్ట్ర ఉత్కంఠ విజయం.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అస్సాంపై గెలుపు 14 కళాశాలల జట్లతో మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి ఒకరేమో కెప్టెన్, మరొకరు స్టార్ బౌలర్.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి జీవిత భాగస్వాములుగా మారిన కివీస్ జోడీ ప్రేమకథ కేంద్రంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. న్యూజిలాండ్‌పై యశస్వి జైస్వాల్ విధ్వంసం.. విరాట్ కోహ్లీ భారీ రికార్డు బద్దలు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం -6వ వార్డు కౌన్సిలర్ పూల జరీన వెల్లింగ్టన్‌లో టీమిండియా పేసర్ల అరుదైన రికార్డు.. 12 ఏళ్ల నాటి ఘనత పునరావృతం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా షేక్ బుర్హానుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక, వైస్ చైర్‌పర్సన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పాకిస్థాన్ చేతిలో ఓటమి.. 29 ఏళ్ల తర్వాత శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు

సేవకుడిగా ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవినీతి, లంచాలకు తావులేని పాలన అందిస్తా తోపుడు బండ్లకు మార్కెట్ సుంకం రద్దు చేస్తా.. ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ హామీ

Select Suryaa Now
సేవకుడిగా ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవినీతి, లంచాలకు తావులేని పాలన అందిస్తా తోపుడు బండ్లకు మార్కెట్ సుంకం రద్దు చేస్తా.. ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ హామీ

వెల్దుర్తి మేజర్ న్యూస్ స్థానికం: ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే తాను ఎన్నికల బరిలో నిలిచానని అభ్యర్థి టీవీ రమేష్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థిక ఆశలు లేవని, కేవలం ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వచ్చానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం మైనారిటీ సోదరులతో నిర్వహించిన ప్రత్యేక ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాత, తండ్రుల బాటలోనే అభివృద్ధి..

గతంలో తన తాత పదేళ్లు, తండ్రి పద్దెనిమిదేళ్ల పాటు ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రమేష్ గుర్తు చేశారు. వారి బాటలోనే నడుస్తూ, గతంలో కంటే మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తనను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఇంటి సభ్యుడిగా, సేవకుడిగా భావించి ఒక్కసారి గెలిపించాలని కోరారు. అర్ధరాత్రి పిలిచినా పలికే వ్యక్తిగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

లంచాలకు తావులేదు.. సుంకం రద్దు..

తాను గెలిస్తే పాలనలో అవినీతి, లంచాలకు ఏమాత్రం తావుండదని రమేష్ అన్నారు. ఇళ్లు నిర్మించుకున్నా, మెట్లు వేసుకున్నా, కొళాయి కనెక్షన్ తీసుకున్నా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. చిరువ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులపై ఆర్థిక భారం తగ్గించేందుకు మార్కెట్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ముస్లిం ప్రాంతాల్లో నెలకొన్న మరుగుదొడ్ల (వాష్ రూమ్స్) కొరతను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

మసీదుల అభివృద్ధికి అండగా ఉంటా..

వరదలు, తుఫానులు వంటి విపత్తులు వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా సేవ చేయడంలో ముస్లిం సోదరులు ఎప్పుడూ ముందుంటారని రమేష్ కొనియాడారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లో ఉన్నందున పనులు చేపట్టలేకపోతున్నామని, ఎన్నికలు ముగిసిన వెంటనే గెలుపోటములతో సంబంధం లేకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. కర్నూలు రోడ్డులోని మసీదు స్లాబ్ నిర్మాణానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తానని, కొండపేట వద్ద ఉన్న చిన్న మసీదు అభివృద్ధికి, బాషా కోరిన షెడ్డు నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని మాటిచ్చారు. గొడవలు, గలాటాలు లేని ప్రశాంతమైన ఊరి కోసం తనను ఆశీర్వదించి గెలిపించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.