BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్.. సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్.. టాస్ గెలిచిన నేపాల్, తుది జట్లు ఇవే వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం
సూర్య, మందమర్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండలంలోని పొన్నారం గ్రామంలో గ్రామ సర్పంచ్ పెంచాల మధు ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో గణపతి, మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా పథకం భరోసాగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెంచాల అమృత రాజలింగు, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందే రాంచందర్, ఆదిల్‌పేట సర్పంచ్ నెండుగురి పున్నం, మామిడిగట్టు సర్పంచ్ సుంకరి దివ్య సతీష్, చిర్రకుంట సర్పంచ్ రాంటెంకి శ్రీలత తిరుపతి, సారంగపల్లి సర్పంచ్ బచ్చలి రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి జీవన్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బానోత్ నీలయ్య, మండల ఉపాధ్యక్షుడు మాస్ సంతోష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.