పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :
పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని, పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్పర్సన్ భీమనేని వందనా దేవి అన్నారు. శుక్రవారం 59వ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో జరిగిన వేడుకలలో మున్సిపల్ నూతన చైర్మన్ మారెళ్ళ రామాంజనేయులుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖ గ్రంధాలయాలు, గ్రామీణ గ్రంథాలయాల్లో " నేర్చుకోవడానికి చదవండి... నాయకత్వం వహించడానికి చదవండి " అనే నినాదంతో వేడుకలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాల్లో నిర్వహించిన పోటీలలో విశేష సంఖ్యలో పాల్గొన్నారన్నారు . పుస్తక పఠనంతో పాటు పోటీ తత్వాన్ని కూడా పెంపొందించామన్నారు. వారిని ప్రోత్సహించేందుకు బహుమతులు కూడా అందించామన్నారు. మున్సిపల్ చైర్మన్ మారెళ్ల రామాంజనేయులు మాట్లాడుతూ గ్రంథాలయాలు కాలానుగుణ పరిస్థితులను భవిష్యత్తుకు చరిత్రగా అందించే విజ్ఞాన భాండాగారాలన్నారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఆయన అభినందించారు. ముఖ్య అతిథులు విద్యార్ధిని విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనము, వక్తృత్వము, ముగ్గులువేయుట వంటి పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ టి. అంబిక, విశ్రాంత అధ్యాపకులు కె. ఉమామహేశ్వర రావు, గ్రంధాలయాధికారి కె. ఎస్. ఎస్. ప్రసాద్, సిబ్బంది ఎన్. రమేష్, ఎస్.కె. కరిముల్లా, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.
గన్నవరం ఏలియ