పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్
వత్సవాయి మేజర్ న్యూస్ , నవంబర్ 20:- వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 కుటుంబాల నుంచి సుమారు 70 మంది కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు.జగ్గయ్యపేట పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో పెద్ద మోదుగుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కొఠారు రాంబాబు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో కళ్యాణం రామారావు (పాలకేంద్రం ప్రెసిడెంట్), అన్నెపాక రాములు, అన్నెపాక గురవయ్య, అన్నెపాక కోటేశ్వరరావు, రాయల శ్రీను, రాయల లక్ష్మయ్య, రాయల వెంకటేశ్వర్లు, నెమలి దానియేలు, రాయల రాము, తోటకూర రమేష్, కోట ప్రసన్న కుమార్, చిలుముల రాములమ్మ, రాయల రాజేష్, కందుల యేసు, సాలె సిల్వరాజు తదితరులు ఉన్నారు.పెద్ద మోదుగుపల్లి గ్రామంలో ఒకేసారి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో గ్రామ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.