BREAKING
చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ ఈషా సింగ్‌తో బ్రేకప్ పుకార్లు, ఆరోపణల వేళ.. ప్రైవసీ కోరిన అవినాష్ మిశ్రా తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌తో కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ భేటీ డైరెక్ట్ ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు చేసిన జీ5 పని కోసం శరద్ కపూర్ భావోద్వేగ అభ్యర్థన.. ఫోన్ చేసి అండగా నిలిచిన షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్‌తో భేటీకి సన్నాహాలు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపు వాయిస్ మెసేజ్.. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడి పేరుతో హెచ్చరిక, ముంబై పోలీసుల దర్యాప్తు కొండగట్టు అంజన్న సాక్షిగా.. ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవెంజర్స్ డూమ్స్‌డేతో ఎంసీయూలోకి రీఎంట్రీ.. విలన్ పాత్రపై రాబర్ట్ డౌనీ జూనియర్ ఆసక్తికర వ్యాఖ్యలు నూతన పాలకవర్గం కోసం కార్యాలయం ముస్తాబు రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ఎందుకు..? - దీపావళి లాభాల వాటా వెంటనే చెల్లించాలి - సీఐటీయూ డిమాండ్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌ కీర్తన ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : స్థానిక ఆదిలాబాద్ బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ ‘మిషన్ స్పందన్’ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార రథాన్ని ప్రారంభించారు. వ్యసన రహిత సమాజ నిర్మాణం "నషా ముక్త్ తెలంగాణ" లక్ష్యంగా ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించేందుకు ఈ ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు దురలవాట్లు యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యసన రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి, బీకే రేవతి, పుష్ప, గీత, అర్చన, తదితరులు పాల్గొన్నారు.