సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి
సూర్య, సిర్పూర్ (టి): టీజీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ కలిసి శుభాకాంక్షలు తెల్పిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదితి. సిర్పూర్ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బస్టాండ్ నిర్మాణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి, త్వరగా నిర్మాణ టెండర్ జారీ చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఆమె విజ్ఞప్తి పై డాక్టర్ అనిల్ కుమార్ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని ఆయన నుంచి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తొందరలో బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.