telangana
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్ వద్ద గల జిల్లా కేంద్ర గ్రంథాలయం లో నేడు నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ , డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించి అభినందించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వారు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మహబూబ్, మంగేష్ దేవతడే, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్చార్జి గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి సోనాల మండల అధ్యక్షులు పోతన్న ,14వ వార్డు ప్రెసిడెంట్ జాదవ్ రాదే శ్యామ్ బెజ్జంకి అనిల్, కౌడాల సంతోష్, సుదర్శన్, గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.