పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన చెల్క సుధాకర్ (తండ్రి బాలయ్య) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమని గ్రామ ఉపసర్పంచ్ మాడపు వసంత బస్వలింగం పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వడ్ల నందు ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్, దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు తన వంతు సహాయంగా బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే వడ్ల నందు ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మాడపు వసంత బస్వలింగం, శ్రీనివాస్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.