BREAKING
మడతలో మతలబు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు – ఎంపీ గురుమూర్తి కరేబియన్ దీవిలో మూడు ఇళ్లు, నాలుగు కొలనులు.. బ్రూస్ విల్లిస్ విలాసవంతమైన ఎస్టేట్ విశేషాలివే మడతలో మతలబు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు – ఎంపీ గురుమూర్తి శ్రీ సత్య సాయి జిల్లా జడ్పీ చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ ప్రమాణస్వీకారం కేవలం తొమ్మిది రోజుల్లోనే కొనుగోలుదారు.. క్రిస్టెన్ డన్‌స్ట్ లాస్ ఏంజిల్స్ ఇంటి విక్రయ విశేషాలు ప్రజలకు నీడనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార ఫ్లెక్సీలు.. బొంరాస్‌పేట్‌లో ఆసక్తికర దృశ్యం జడ్పిటిసి గా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం జడ్పిటిసి గా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం అట్లాంటాలో 330 ఎకరాల భారీ స్టూడియో.. టైలర్ పెర్రీ సొంత సామ్రాజ్యం విశేషాలివే ‘రామాయణ’ ఒక ఎజెండా సినిమా.. రావణుడిని హీరోలా చూపించారు: నటుడు నితీశ్ భరద్వాజ్ తీవ్ర విమర్శలు చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ ఈషా సింగ్‌తో బ్రేకప్ పుకార్లు, ఆరోపణల వేళ.. ప్రైవసీ కోరిన అవినాష్ మిశ్రా తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌తో కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ భేటీ డైరెక్ట్ ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు చేసిన జీ5 పని కోసం శరద్ కపూర్ భావోద్వేగ అభ్యర్థన.. ఫోన్ చేసి అండగా నిలిచిన షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్‌తో భేటీకి సన్నాహాలు

చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
చెకుముకి రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ


చెకుముకి రాష్ట్రస్థాయి సంబరాలలో మెరిసిన జిల్లా విద్యార్థులు
 

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో అనంతపురం జిల్లా రూరల్ ప్రాంతానికి చెందిన రాధా స్కూల్ ఆఫ్ లర్నింగ్ విద్యార్థులు మూడవ స్థానాన్ని కైవసం చేసుకొని తృతీయ బహుమతి గెలిచినట్లు జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు రాష్ట్ర నాయకులు సాకె భాస్కర్ తెలియజేశారు.శుక్రవారం స్కూలుకు వెళ్లి విద్యార్థులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన  సైన్స్ సంబరాలకు మన జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో  నగరంలోని న్యూటన్ హైస్కూల్ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల విభాగం నుండి రాధా స్కూల్ ఆఫ్ లర్నింగ్ విద్యార్థులు పాల్గొన్నారని వారు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల 56 టీంలు పాల్గొన్నట్లు తెలిపారు.వాటిలో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో నిర్వహించిన సైన్స్ సంబరాలలో 28 టీంలు హాజరవ్వగా అందులో జిల్లాకు చెందిన విద్యార్థినిలు ఎ.వర్ష చౌదరి పి.విష్ణుప్రియ ఎ.లాస్య తృతీయ స్థానంలో నిలిచారని వారన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జిల్లాలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రాష్ట్రస్థాయి బహుమతి గెలవడం చాలా ఆనందదాయకమని ముందు ముందు మరిన్ని సైంటిఫిక్ టెంపర్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం శ్రీదేవి, హెచ్.ఎం. వి.జయచంద్ర ఉపాధ్యాయులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.