శ్రీ సత్య సాయి జిల్లా జడ్పీ చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ ప్రమాణస్వీకారం
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని రెవెన్యూ భవన్ నందు కూటమి ద్వారా ఎంపికైన జడ్పిటిసి సభ్యులు చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిటాల శ్రీరామ్ తో జడ్పీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు.