BREAKING
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణంపై ప్రముఖ గాయకుడు బ్రూనో మార్స్ భావోద్వేగ పోస్ట్.. చివరి ఆలింగనం ఫోటో వైరల్ పెద్ద మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 15 కుటుంబాలకు చెందిన సుమారు 70 మంది చేరిక జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం… నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పుస్తక పఠనంతో విజ్ఞానం, సామాజిక స్పృహ: గ్రంథాలయాల సంస్థ చైర్ పర్సన్ భీమనేని వందనా దేవి బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే నాకు ఎక్కువ గౌరవం, డబ్బు, స్టార్‌డమ్ ఇచ్చాయి: సమీరా రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి - నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ డ్రగ్స్ కేసులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడి అరెస్ట్.. సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి సిర్పూర్ (టి) బస్టాండ్ నిర్మాణ టెండర్ త్వరగా జారీ చేయాలని అదిత విజ్ఞప్తి పేద కుటుంబానికి వడ్ల నందు ఫౌండేషన్ రూ.5 వేల ఆర్థిక సాయం: ఉపసర్పంచ్ వసంత బస్వలింగం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: భారత్ వర్సెస్ నేపాల్ మ్యాచ్.. టాస్ గెలిచిన నేపాల్, తుది జట్లు ఇవే వలస కూలీలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

14 కళాశాలల జట్లతో మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం

Select Suryaa Now
14 కళాశాలల జట్లతో మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభం

నరసరావుపేట : కేసనపల్లిలోని ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. విశ్వవిద్యా లయ అనుబంధ కళాశాలలకు చెందిన 14 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. టోర్నమెంట్ ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగోతు సబిత (డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్) క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు. ఎంఏఎం విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు అధ్యక్షత వహించి పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంఏఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంచినేని ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థినులకు చదువుతోపాటు క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతా యని, తద్వారా వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. క్రీడాకారిణుల ప్రతిభను పరిశీలించి జట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ముప్పాళ్ల ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చుండు వెంకటరావు, తెనాలి జేఎంజే మహిళా కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డాక్టర్ కె. అరుణ సుజాత వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో క్రీడాకారిణులు, అధ్యాపకులు, నిర్వాహకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..