జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తా... జడ్పీ చైర్ పర్సన్ గొల్లపల్లి అమూల్య.....
ఈరోజు జీవితంలో మర్చిపోలేను..... జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తా... జడ్పీ చైర్ పర్సన్ గొల్లపల్లి అమూల్య.....
అమలాపురం మేజర్ న్యూస్
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు జెడ్పీటీసీగా అత్యధిక మెజారిటీ తో ఎన్నికై, నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు అని గొల్లపల్లి అమూల్య అన్నారు
దళిత మహిళనైనా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్‌పర్సన్ అవకాశం ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కూటమి నాయకులకు, మామిడికుదురు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అమూల్య తెలిపారు. విద్యావంతురాలిగా ప్రజా సేవే లక్షంగాy ముందుకు సాగుతున్న నేను మున్ముందు ఇంకా ప్రజా సేవను బాధ్యతగా స్వీకరిస్తాననని ఆమె తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీ అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు..