BREAKING
పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాలన్నింటిలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు గ్రామంలో షెడ్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి నికోల్స్ అజేయ 175తో కివీస్ 368.. యశస్వి, రాహుల్ జోరుతో టీమిండియా దీటైన బదులు జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తా... జడ్పీ చైర్ పర్సన్ గొల్లపల్లి అమూల్య..... భారీ వాహనాల రాకపోకలతో ప్రజలకు ఇబ్బందులు - ప్రమాదాలకు తావులేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి సేవకుడిగా ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవినీతి, లంచాలకు తావులేని పాలన అందిస్తా తోపుడు బండ్లకు మార్కెట్ సుంకం రద్దు చేస్తా.. ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ హామీ 897 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే? రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు – ఐటీడీఏ పీఓ మంద మకరందు ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త మైలురాయి.. హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు మండల అభివృద్ధికి సహకరించాలి: జడ్పిటిసి బొర్రా అనిత బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్

ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి

Select Suryaa Now
ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ సందడి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి పులికొండ, జానపద కళాకారిణి నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇడుపు కాయితం నుంచి మరో ఆకర్షణీయమైన పాట విడుదలైంది. ఈ సినిమాలోని గోగులు గోగులు లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రమోషన్లలో వేగం పెంచుతున్న మేకర్స్, విడుదల చేసిన ఈ కొత్త పాటతో సంగీత ప్రియులు, సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు బరాత్ బీట్ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా, ఇప్పుడు వచ్చిన గోగులు గోగులు సాంగ్ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. గ్రామీణ నేపథ్యం, పెళ్లి సందడి, కుటుంబ బంధాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తూ వెండితెరకు పరిచయమవుతున్నారు. తెలంగాణ జానపద గీతాలు, నృత్యాలతో ఇప్పటికే విశేష గుర్తింపు పొందిన నాగదుర్గ, ఈ సినిమాలో తన సహజమైన అభినయంతో ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. అభినవ్ గోమటం, అభయ్ బేతిగంటి, రాచ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మాత బన్నీ వాస్ వర్క్స్, తబిత సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇడుపు కాయితం చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.