నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలో భగత్ సింగ్ 119వ జయంతిని AIYF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగ రాముడు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయ సాధన కోసమై యువత ఆయన జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిగా STOP DRUGS-START SPORTS అనే నినాదాన్ని యువతి యువకులు ముందుకు తీసుకుని వెళ్లి దేశాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా
భగతసింగ్ 1907 సెప్టెంబర్ 28న పంగా గ్రామంలో జన్మించారన్నారు. ఆయన కుటుంబం అంతట దేశభక్తి వాతావరణం ఉండేది భగత్ సింగ్ చిన్నతనంలోనే జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఆయన మనసు తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆ సంఘటనే ఆయనను భారతదేశ
స్వతంత్ర పోరాటం వైపు నడిపించిందన్నారు. భగత్ సింగ్ కేవలం ఆవేశం ఉన్న పోరాటయోధులే మాత్రమే కాదు గొప్ప ఆలోచనపరుడు మరియు దేశానికి స్వేచ్ఛ అంటే కేవలం బ్రిటిష్ పాలన ముగియడమే కాదని సమాజంలో దోపిడీ రహిత వాతావరణం ఏర్పడటమే నిజమైన స్వాతంత్రం అని ఆయన నమ్మారన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, రాజు గురు సుక్కు దేవ్ వంటి వీరులతో కలిసి ఆయన "హిందుస్థాన్ సోషల్ సోషలిస్టు పబ్లిక్ అసోసియేషన్" ద్వారా విప్లవాన్ని ముందుకు నడిపించారన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అణిచి వేత ధోరణికి నిరసనగా సెంట్రల్ అసెంబ్లీలో మామూలు విసిరి తప్పించుకోకుండా ఇంకిలాబా జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అని నినాదిస్తూ ధైర్యంగా అరెస్టయ్యారన్నారు.
1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల చిన్న వయసులోనే భగత్ సింగ్ రాజు సుకుదేవులతో కలిసి నవ్వుతూ ఉరికంబానేక్కారన్నారు. ఆయన చూపిన ధైర్యం చేసిన త్యాగం భారతదేశ యువతలో అపారమైన దేశభక్తిని నింపాయని, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఆయన వంటి వేలాది మంది త్యాగాల ఫలితమే భగత్ సింగ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం మనం ఆయనకిచ్చి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఉదయ్ మంజునాథ్ శివ వెంకట్ తదితరులు పాల్గొన్నారు