నేత్రదానం చేసిన పేరవరం వాసి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆత్రేయపురం మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన గారపాటి సీతారాములు (86) గురువారం మృతి చెందారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ఆయన కుమారుడు కృష్ణప్రసాద్ తన తండ్రి నేత్రాలను నిడదవోలులోని రామాయమ్మ నేత్రాలయానికి దానం చేశారు. మరణానంతరం కూడా మరొకరికి చూపును ప్రసాదించాలనే ఉద్దేశంతో నేత్రదానం చేయడం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర టి యెన్ టి యు సి కార్యనిర్వాహక కార్యదర్శి ముళ్ళపూడి భాస్కరరావు సత్యనారాయణ తదితరులు సీతారాములు మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు