నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం
నెల్లూరు, కలెక్టరేట్, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. జిల్లా పరిధిలోని ఆరు కేంద్రాల్లో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో మొత్తం 30 జెడ్పీటీసీ స్థానాలకు 103 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 362 ఎంపీటీసీ స్థానాలకు 887 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆత్మకూరు, కొడవలూరు, ఉదయగిరి, కావలి, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 352 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు 386 మంది సూపర్‌వైజర్లు, 1,158 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 12,85,840 మంది ఓటర్లు ఉండగా, వారిలో 8,53,540 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.