BREAKING
నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు మిత్రునికి పదో తరగతి స్నేహితుల సన్మానం ‘సైమన్’ తుఫాను ముప్పు...ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మెక్సికో అధ్యక్షురాలు హెచ్చరిక యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్

నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 6 కిలోల గంజాయి పట్టివేత.

Select Suryaa Now
నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద  6 కిలోల గంజాయి పట్టివేత.


ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
నర్సీపట్నం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన జయశీలన్‌ (43) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ గపూర్ మాట్లాడుతూ ఉదయం 11 గంటల గంజాయి అక్రమ రవాణాపై అందిన సమాచారంతో టౌన్ ఎస్‌ఐ జె. రమేష్ ,ఎస్ఐ ఉమా మహేశ్వరరావు సిబ్బందితో కలిసి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద తనిఖీలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా బ్యాగుతో వెళ్తున్న జయశీలన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, రెండు ప్యాకెట్లలో 6 కిలోల గంజాయి లభించిందన్నారు.
విచారణలో ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద రూ.6,000కు గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుడిని నర్సీపట్నం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించమన్నారు. అమ్మిన వ్యక్తిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె గపూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్. ఎస్సై ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు.