గుంటూరు:- ఆ మూడు మండలాలలో ఎన్నికలకు బ్రేక్!!- స్పందించిన కలెక్టర్
గుంటూరు జిల్లాలోని కాకుమాను,పెదనందిపాడు,ఫిరంగిపురం మండలాలలో ఎన్నికలు యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్,ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు.తొలుత తుఫాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడంతో యధా విధిగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఓటర్లు అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.దీనితో ఆ మండలాలలో ఎన్నికల వాయిదా సస్పెన్స్ కు తెరపడింది.
అనిల్ కాంత్.కె....గుంటూరు ప్రతినిథి