BREAKING
వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇళ్లపై ఈడీ దాడులు భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం దశాబ్దాల తర్వాత ఆయిల్‌ఫెడ్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తొలి వన్డేలో భారత్ సంచలన విజయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి నెల్లూరు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచన ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్!-నీట మునిగిన ఇళ్లు.. కష్టాల్లో ప్రజలు.. వెంటనే స్పందించి భోజనాలు ఏర్పాటు! పంటలను పరిశీలించిన సీపీఐ(ఎం)నేతలు పెద్దల ఆశీస్సులతో 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం: ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్ మహబూబాబాద్ లో పట్ట పగలే భారీ చోరీ.. సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

Select Suryaa Now
 సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న 'అర్నబ్', 'మురసు' తుఫాన్ల ప్రభావంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సంభాషణలో భాగంగా, రాష్ట్రంలో 'అర్నబ్', 'మురసు' తుఫాన్ల కారణంగా విపరీతంగా సంభవించిన ఆస్తి, పంట నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి సమగ్రంగా వివరించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. సీఎం వివరణపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, ఏపీకి కేంద్రం తరఫున అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.