80,170 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన రూప్ కుమార్ యాదవ్‌కు బీద రవిచంద్ర అభినందనలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్రను నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర రూప్ కుమార్ యాదవ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో ఎన్నికల విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.