ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: పేదల వైద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 110 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.49,33,168 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా పేదలకు వైద్య సాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.-అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.