BREAKING
గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం జనసేన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు- బాక్సాఫీస్ వద్ద కీర్తి సురేష్ ‘డోరతీ’ హవా.. 19 రోజుల్లో మైండ్ బ్లోయింగ్ వసూళ్లు! కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500...ఆర్జీ-3లో ఐఎన్టీయూసీ పాలాభిషేకం *ఘనంగా పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు* యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలపై మక్కువ చూపాలి... బాక్సాఫీస్ వద్ద విజయ్ సేతుపతి ‘బత్తా’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం! వేసవికి ముందే విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి మండల టిడిపి అత్యవసర సమావేశం.. సింగరేణిలో డిజిఎం బి.వి సేవలు మరువలేనివి సాంకేతికతపై పట్టు సాధించండి...ఉన్నత శిఖరాలను అధిరోహించండి శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం ఓటింగ్ ట్రెండ్.. టాప్‌లో రోహిత్, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక

Select Suryaa Now
మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక

నెల్లిమర్ల, సూర్య :  మండలంలోని మొయిద గ్రామంల వైసిపికి చెందిన 20 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్  నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, బంగార్రాజు నాయకత్వంపై నమ్మకంతో వారు పార్టీలోకి వచ్చారు. ​కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి శ కర్రోతు బంగార్రాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, మొయిద గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనందకుమార్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, నగర పంచాయతీ అధ్యక్షులు లెంక అప్పలనాయుడు, టీడీపీ నాయకులు అట్టాడ శ్రీధర్, దంతులూరి అజయ్ బాబు  పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.